భవ్యశ్రీ మృతి ఘటనపై నిజా నిజాలు నిగ్గు తేల్చాలి

  • భవ్యశ్రీ మృతి పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి
  • రోజవ్వకు మాటలు ఎక్కువ, పని తక్కువ
  • ఒక ఆడబిడ్డ అనుమానస్పద స్దితిలో మృతి చెంది పదిరోజులు దాటుతున్నా జిల్లాకు చెందిన రోజా, పెద్దిరెడ్డి, నారాయణ స్వామీ స్పందించకుండా మంత్రులు నిద్రపోతూన్నారు
  • ఆడపిల్లకు కష్టం వస్తే గన్ కన్న జగన్ ముందు వస్తాడని చెప్పినా రోజా ఎక్కడుంది ఇప్పుడు
  • 10 రోజులైనా భవ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ రాలేదు.. జిల్లా మంత్రులు చూడలేదు
  • తిరుమలలో చిరుతపులి దాడిలో చిన్నారి చనిపోతే ఇప్పటి వరకు జగన్ స్పందించలేదు
  • భవ్యశ్రీ విషయం మీదా మాట్లాడితే కేసులు పెడుతామని చిత్తూరు ఎస్పీ ప్రజలను బెదిస్తున్నారు
  • ప్రజలకు సమాధానం అడిగితే కేసులు పెడుతామని బెదిరిస్తారా
  • పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి నగరి నుండి అమరావతి వెళతావే పక్కనే ఉండే భవ్యశ్రీ కుటుంబ భాదలు వినడానికి రోజాకు సమయం లేదా
  • భవ్యశ్రీ కుటుంబానికి యాబైలక్షలు సహాయం చేసి ప్రభుత్వం అదుకోవాలీ
  • జనసేన పార్టీ కిరణ్ రాయల్ డిమాండ్

తిరుపతి: గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలం వేణుగోపాలంపురం కు చెందిన ఇంటర్ చదువుతున్న విద్యార్థి భవ్య శ్రీ అత్యాచారంపై అనుమానం వ్యక్తమవుతున్నదని జనసేన పార్టీ నేతలు అడ్వకేట్ వనజ, అరుణ, రాజేష్ ఆచారి, కిషోర్, రమేష్ నాయుడు, గుట్టా నాగరాజు, ఆది తదితరులతో కలిసి కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. భవ్యశ్రీ ఇంటి నుండి వెళ్లిన వెంటనే అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు న్యాయం చేయకపోగా తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి అందులో ఓ మహిళా మంత్రి కూడా భవ్యశ్రీ కుటుంబానికి న్యాయం చేయకపోవడం, కనీసం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రోజావ్వకు మాటలు ఎక్కువ పని తక్కువ అని హెద్దేవ చేశారు. వడ్డెర కులం కు చెందిన బిసి బాలికని నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వారు హెచ్చరించారు. భవ్య శ్రీ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బావిలో పడి మృతి చెందడానికి భవ్యశ్రీ కి ఈత బాగా వచ్చునని, అందులో మృతదేహం కు వెంట్రుకలు ఊడి పోయి ఉండడం చూస్తుంటే కచ్చితంగా అనుమానాలకు దారితీస్తుందని, భవ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని, బీసీలను చిన్న చూపు చూస్తే చూస్తూ ఊరుకునేదే లేదని, తక్షణమే ఈ ఘటనపై నిజా, నిజాలు నిగ్గు తేల్చాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని కిరణ్ డిమాండ్ చేశారు.