గణపతి పూజలో పత్రి విశిష్టత

హిందువులకు తొలి పండుగ వినాయక చవితి. ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాధుడికే. అగ్రపూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు. తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి, విఙ్ఞతతో గణాధిపత్యం పొందిన బుద్ధివంతుడు. అలాంటి గణపతిని పూజించడానికి వినాయకచవితి నాడు పత్రాలే ప్రధానమైనవి గణనాధుని అనేక రకాల పత్రాలతో పూజిస్తాం. విఘ్నేశ్వరుని 21 రకాల పత్రాలతో పూజించడం ఆనవాయితీ. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. ఆ 21 రకాలు పత్రాల పేర్లు గురించి మనo తెలుసుకొoదాo.

1. మాచీపత్రం (మాచిపత్రి)

2. బృహతీ పత్రం (వాకుడాకు)

3. బిల్వ పత్రం (మారేడు)

4. దూర్వాయుగ్మం (గరిక)

5. దత్తూర పత్రం (ఉమ్మెత్త)

6. బదరీ పత్రం (రేగు)

7. ఆపామార్గ పత్రం (ఉత్తరేణి)

8. తులసీ పత్రం (తులసీ)

9. చూత పత్రం (మామిడాకు)

10. కరవీర పత్రం (గన్నేరు)

11. విష్ణుక్రాంత పత్రం (విష్ణు కాంత)

12. దాడిమీ పత్రం (దానిమ్మ)

13. దేవదారు పత్రం (దేవదారు

14. మరువక పత్రం (మరువం

15. సింధూర పత్రం (వావిలి)  

16. జాజీ పత్రం (జాజి ఆకు)

17. గండకీ పత్రం (దేవ కాంచనం)

18. శమీ పత్రం (జమ్మి ఆకు)

19. అశ్వత్థ పత్రం (రావి ఆకు

20. అర్జున పత్రం (తెల్ల మద్ది)

21. ఆర్క పత్రం (జిల్లేడు)

ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో గణపతిని పూజించి ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు ఒప్పు కొన్న నిజం.

భక్తీ తో గరిక సమర్పించినా ప్రసన్నమయ్యే గణనాధుని పైన చెప్పిన 21 రకాల పత్రాలతో పూజించి విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో పాటూ ఆరోగ్యాన్ని కూడా పొందoడి.

Also read: జై బోలో గణేష్ మహారాజ్ కి జై