రాబోయే ప్రభుత్వం జనసేననే: జనసేన జానీ

*ఓడిపోయినా బెదరలేదు.. వదలలేదు.. అదరలేదు

పాలకొండ నియోజకవర్గ జనసేన జానీ మాట్లాడుతూ.. జనసేన పార్టీఆవిర్భావం 2014 మార్చ్14నాటికి-నేటికి చాలా తేడా కనిపిస్తుంది. ఇపుడు పచ్చ మీడియా గొట్టాలు కూడా జనసేన అధికార ప్రతినిధులను పిలిచిస్టూడియోలో వాదోపవాదాలకు అవకాశము ఇస్తున్నాయి. ప్రజల్లో కూడా ఓ చర్బ బలముగా ఉంది. ఓడిపోయినా బెదరలేదు వదలలేదు, అదరలేదు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు 3000 మంది చనిపోతే అధికార పార్టీ గానీ ప్రతిపక్షం గానీ ఒక్కరికి అంటే ఒక్కరికి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకొక్కరికి లక్షరూపాయిలు చొప్పున తన సొంత డబ్బులు 30 కోట్లరూపాయిలు ఇచ్చి ఆదుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అధికారము కట్టబెడితే రాష్ట్ర సంపదను కాపాడుతాడు అనే నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ తప్పు చేయకపోయినా వైసీపీ ఎందుకు పవన్ ను ఆడిపోసుకుంటున్నారో.. ప్రజలు ఆలోచనలో పడ్డారు. ప్రతీ జిల్లాలోనూ గ్రామీణ ప్రాంతాల్లో సైతము కొన్ని నియోజకవర్గాల్లో ప్రతీ ఊరులో జనసేన జెండా ఎగరవేశారు. ఇంకా కొన్ని గ్రామలులో ఎగరవలిసి ఉంది. అది నాయకుడు దూకుడు శ్రేణుల్లో ఉత్తేజము పెంచింది, యువతను మరింత ఆలోచనలో నెట్టింది. మీడియా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు, ప్రతీ వారి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి.. మనము చూపక పోయినా.. ప్రజలు జనసేన కార్యక్రమాలు యూ ట్యూబ్ లో చూస్తారు.. దాని బదులు మనమే చూపిద్దాము అని నిర్ధారించుకున్నారు. రాబోయే ప్రభుత్వం జనసేననే అని జనసేన జానీ చెప్పడం జరిగింది.