పార్టీ ఆదేశానుసారం నిరసన తెలిపిన వీరమహిళా విభాగం

ప్ర‌మాదం అంచున లక్ష‌లాది విద్యార్థులు, కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న వేళ వైసీపీ ప్ర‌భుత్వం తీవ్ర నిర్లక్ష్యం మొండి వైఖరితో పిల్లలకి తరగతులు నిర్వహించడంపై, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ వీరమహిళా విభాగం తరుపున వీరమహిళలు వారి గళాన్ని బలంగా వినిపించారు.

ఏపి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వైసీపీ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిన వ్యక్తం చేసారు. కరోనా ఉదృతి దృష్ట్యా ఏపిలో ఇంకా పిల్లలకి వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడం, వారి ఆరోగ్య క్షేమం కోసం ప్రస్తుతం తరగతులు వాయిదా వెయ్యాలని, కరోనా టెస్టులు చెయ్యకుండా, స్కూళ్లలో కనీసం జాగ్రత్తలు పాటించకుండా, శానిటైజర్, మాస్కులు కూడా ఇవ్వలేని ప్రభుత్వం పిల్లలు కరోనా బారిన పడితే ఏమిటి పరిస్థితి, వారి ప్రాణాలకు ఎంత ముప్పు వాటిల్లుతుంది, తల్లిదండ్రులు భయాందోళనలతో పిల్లలని బడికి పంపిస్తున్నారు. ఈ కరోనా వేవ్ తగ్గుముఖం పట్టేవరకు ఏపి లో తరగతులు వాయిదా వెయ్యాలని వైసీపీ ప్రభుత్వం పై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని నిరసన తెలిపారు.

ఎస్ కోట వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో
ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లక్షల విద్యార్థులతో పాటు వారి కుటుంబాలనూ కరోనా ముప్పులోకి నెట్టే విధంగా పాఠశాలల్లో తరగతులను కొనసాగిస్తూ, మొండి వైఖరితో బాధ్యతా రాహిత్యాన్ని అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోవిడ్ ఉధృతి తగ్గే వరకూ తరగతులను వాయిదా వేయాలని జనసేనపార్టీ నుండి వీరమహిళా విభాగం తరుపున ఎస్ కోట నియోజకవర్గం, ఎల్ కోట మండలం, దాసుళ్ళపాలెం వీరమహిళ శ్రీమతి సగుబిండి వెంకటలక్ష్మి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెద్దాపురం వీరమహిళా విభాగం ఆధ్వర్యంలో
ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ లక్షల విద్యార్థులతో పాటు వారి కుటుంబాలనూ కరోనా ముప్పులోకి నెట్టే విధంగా పాఠశాలల్లో తరగతులను కొనసాగిస్తూ, మొండి వైఖరితో బాధ్యతా రాహిత్యాన్ని అవలంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోవిడ్ ఉధృతి తగ్గే వరకూ తరగతులను వాయిదా వేయాలని జనసేనపార్టీ నుండి వీరమహిళా విభాగం తరుపున పెద్దాపురం నియోజకవర్గం వీరమహిళలు శ్రీమతి పెంకే వెంకటలక్ష్మి, చోడిశెట్టి ఇందిరా ప్రియదర్శిని లు ప్లకార్డులు నల్ల రిబ్బన్ తో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.