*తిరువూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు పిలుపు
తిరువూరు, ఏ.కొండూరు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికులు, వీరమహిళలు పనిచేయాలని తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, గంపలగూడెం జనసేన మండల పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకటకృష్ణ పిలుపునిచ్చారు. మండలంలో చీమలపాడు గ్రామంలో సోమవారం వారు స్థానిక పత్రిక విలేకరులతో మాట్లాడుతు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను కూటమి నాయకత్వం ఎన్నికల బరిలో దింపిందని జనసేన నాయకులు, జనసైనికులు ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విధంగా ముమ్మర ప్రచారం జరపాలని ఆయన కోరారు. అదే విధంగా విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలంటే ఆలపాటిని గెలిపించుకోవాలని వారు అన్నారు. భవిష్యత్తు రోజుల్లో విద్యా, ఉద్యోగ, ఉపాధి కొరకు తన గళాన్ని శాసన మండలిలో వినిపించాలంటే ఆలపాటి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారు సూచించారు. అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి అందిస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించడమే లక్ష్యంగా జనసైనికులు పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు విద్యా ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్న జనసైనికులు, వీర మహిళలు బాధ్యతగా ఈనెల 27వ తేదీన తమ పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి కూటమి అభ్యర్థి ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత జనసైనికులపై ఉందని ప్రతి ఒక్క జనసైనికుడు కూటమి అభ్యర్థి ఆలపాటి విజయానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
Share this content:
Post Comment