నియంతలు, హంతకుల గెలుపు తాత్కాలికమే: సమంత

అక్కినేని నాగచైతన్యతో వివాహ బంధం ముగిసి పోయిందని సమంత కాసపటి క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. వివాహా జీవనంలో ఒడిడుదుకులు ప్రారంభమైన నాటి నుండి సమంత టెన్షన్‌లో ఉంది. అనేక గుళ్ల చుట్టూ తిరిగింది. యాగాలు చేయించింది. అయినా చైతుతో బందం గట్టిపడలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఒకే సమయంలో తాము విడిపోతున్నామని ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ” నేను బాధలో ఉన్నప్పుడల్లా అమ్మ చెప్పిన మాటలు గుర్తు కొస్తుంటాయి. చరిత్రలో ఎప్పుడు ప్రేమ, నిజాయితీనే శాశ్వతంగా ఉంటాయి. నియంతలు, హంతకుల గెలుపు ఎప్పుడు తాత్కాలికమే. వారు ఎప్పటికయినా నేల కొరగక తప్పదు. ఇదే జరిగితీరుతుంది” అని పేర్కొంది. ఇప్పుడు ఈ రాతలు సంచలనం రేపుతున్నాయి.