జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన పోతవరం గ్రామస్తులు

  • మోకాలు శస్త్ర చికిత్సకు సహకరించిన జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన పోతవరం గ్రామస్తులు

దర్శి నియోజకవర్గం: జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుంటూరు వారి సహకారంతో దర్శి నియోజకవర్గం, దర్శి మండలంలోని పోతవరం గ్రామంలో సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలో మెగా పవనోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు పోతవరం గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించగా.. ఎనిమిది మందికి మోకాలు శస్త్ర చికిత్స అవసరం అయినది. శస్త్ర చికిత్సలో మోకాలు చిప్ప మార్చాలి అని తెలుపడం జరిగింది. విషయం తెలుసుకున్న వరికూటి నాగరాజు, రామ్మోహన్ గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడి ఈ మెడికల్ క్యాంపులో సెలెక్ట్ అయిన వారికి ఉచితంగా చేయవలసిందిగా డాక్టర్స్ ని కోరగా వారు ఆమోదించినారు. శుక్రవారం వారు గుంటూరు హాస్పిటల్ కి వెళ్లే నేపథ్యంలో మాకు ఈ సహాయాన్ని అందించిన వరికూటి నాగరాజు కు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఊరిలోనే రామాలయం దగ్గర చిన్న మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన ఓబులాపురం కొండ మరియు అబ్బు సుబ్బుకు వరికూటి నాగరాజు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొంకాల రామ్మోహన్ మాట్లాడుతూ.. ఆదిత్య హాస్పిటల్ వారితో మేము మాట్లాడి ఉన్నాము అక్కడ ఎటువంటి రూపాయి చెల్లించకుండానే మీకు ఉచితంగా ఆపరేషన్ చేస్తారంటూ తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని గత నెలలో ఈ పోతవరం గ్రామంలోనే మెడికల్ క్యాంపును నిర్వహిద్దామని తెలియజేసిన వరికూటి నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీజీపి రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు మాట్లాడుతూ.. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అందరూ తెలుసుకోవాలని, రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని ఎంతో మందికి మేము ఇలాగే సహాయం చేస్తామని వారు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డి.ఇ.ఓ బద్దుల లక్ష్మయ్య, షేక్ ఇర్షాద్, ఉప్పు సుబ్బు, నాగిశెట్టి అజయ్ మరియు జనసైనికులు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.