ఓటరు సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి

పాలకొండ నియోజకవర్గం, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు మరియు నాలుగు మండలాల తహాశీల్దార్లు, డీటీలు ఎన్నికల ఆపరేటర్ల సమావేశం సీతంపేట ఐటిడిఏ పివో కల్పన కుమారి మేడం సమావేశంలో పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పివో మేడం కల్పన కుమారి మాట్లాడుతూ ఓటరు సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని మరియు ఇంటింటికి చేపడుతున్న ఓటరు సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటిడిఎ పీవో కల్పనకుమారి అన్నారు. ఓటర్ల సర్వేను వేగవంతం చేసేలా బి.ఎల్.ఓలకు ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు, మరణించిన వారి పేర్లు తొలగించడం, పోలింగ్ బూత్ లను సరిచేయడం, వేరే రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లు తొలగించడం వంటివి చేసేటప్పుడు నిబంధనల ప్రకారం చేస్తామని అన్నారు. అదే విధంగా వివిధ రాజకీయ పార్టీలు చెప్పిన అంశాలను పరిశీలిస్తామని అన్నారు. కొత్త పంచాయతీలకు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. బోగస్ ఓట్లు తొలగిస్తామని అన్నారు. ఒకే ఇంటి నంబర్ మీద ఎక్కువ ఓట్లు ఉన్న అంశాన్ని పరిశీలించి వాటిని కూడా తొలగిస్తామని అన్నారు. సరిగా కనిపించని ఓటర్ల ఫోటోలను కూడా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున జనసేన జానీ, పోరెడ్డి ప్రశాంత్, జామి అనిల్, సవర సింహద్రి, సవర గణేష్, దినేష్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.