క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన గాదె

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ చేసేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను శుక్రవారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. అతి త్వరలో రోజుల వ్యవధిలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి ఈ కిట్లను అందించటం జరుగుతుందని తెలిపారు..