మహిళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు కట్టిన నగదు తిరిగి ఇవ్వండి..!

నెల్లూరు, కమీషనర్ దృష్టికి తీసుకెళ్లిన జనసేన నేత నూనె మల్లికార్జున యాదవ్ నెల్లూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన దుర్గా అనే మహిళ టిడ్కో గృహం కోసం మూడు దఫాలుగా 75 వేల రూపాయలను నెల్లూరు నగరం మున్సిపల్ కమిషనర్ పేరిట డిడి తీసి గృహానికి దరఖాస్తు చేసుకుంది. అయితే గృహాలు కేటాయింపు మరింత ఆలస్యం కావడం, ఈ క్రమంలో తన బిడ్డల చదువు కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోమతి నగర్ లో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఆమె తనకు గృహం వద్దని తాను కట్టిన నగదు తిరిగి ఇప్పించాలని ఆమె జనసేన నాయకులను కోరింది. ఈ నేపథ్యంలో జనసేన సీనియర్ నాయకులు, కో-ఆప్షన్ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ సోమవారం నాటి కార్పొరేషన్ గ్రీవెన్స్ డేలో నగర్ కమిషనర్ దృష్టికి ఆమె సమస్యను తీసుకెళ్లి ఆమె కట్టిన 75 వేల రూపాయలను తిరిగి ఇప్పించేందుకు అభ్యర్థించారు. ఇందుకు స్పందించిన కమిషనర్ ఆమె నగదు ఇప్పించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ప్రశాంత్ గౌడ్, జనసేన నగర నాయకులు షేక్ యాసిన్, నరహరి, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment