కళాశాలను అభివృద్ధి చేయటంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

రంపచోడవరం: దేవీపట్నం మండలం, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తోయ్యేరు గ్రామంలో 2002 లో స్థాపించబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ముంపుకి గురవడంతో తొయ్యేరు గ్రామం భూసేకరణ నోటిఫికేషన్2016 సంవత్సరంలోనే సదరు కళాశాల భవనసముదాయాలకి ఋస్ 1, 07, 64, 316/- (కోటి ఏడులక్షల అరవైనాలుగు వేల ముడువందలపదహరు రూపాయలు) మంజూరు చేయటం జరిగింది. (ఋఎఫ్ ఏ/96/2022,ద్త్ 9–11-2022) మంజూరు చేయగా గ్రామాలతో పాటుగా 2020లో కళాశాలను కూడా కాళీ చేశారు. ఈ కళాశాలను ఇందుకూరుపేట గ్రామంలో హై స్కూల్ నందు మూడు గదులలో కళాశాల విద్యార్థిని, విద్యార్థులను కూర్చో బెట్టి అరకొర వసతులతో విద్యను అందించడం జరుగుతుంది. ఈ వసతులకు సంబంధించి ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు అనేక మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా జడ్పీ హైస్కూల్ పక్కన ఉన్నటువంటి పాడుబడిన భవనాలు ఉన్న ప్రదేశంలో కళాశాల నిర్మించటం జారుతుంది అని ఎమ్మార్వో దేవీపట్నం వారు ప్రిఫర్ ఆ/581/2022, తేదీ 23/2/2023 కేటాయించినప్పటికీ, సర్వే నెంబర్ 283-2 ఇందుకూరు గ్రామంలో రెండు ఎకరాలు కేటాయించగా ఒక ఎకరంలో పాడుపడ్డ భవనాలు ఉన్నాయి. అవి తొలగించటానికి సుమారు 10 నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది అనవసరపు ఖర్చు అయినను ఇప్పటివరకు కాలేజీ పనులు మొదలు పెట్టలేదు. ఈ నిర్లక్ష్య ధోరణి అనేది అనేది అధికారుల వైఫల్య మా లేక ప్రభుత్వ వైఫల్య మా అర్థం కావట్లేదు. ఈ విషయంపై దేవీపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు రాయుడు తీవ్రంగా మండిపడ్డారు. జిల్లా లోనే దేవీపట్నం కళాశాల విద్యార్థులు వరుసగా రెండు సంవత్సరాలు మొదటి స్థానంలో వచ్చినా, కళాశాలను అభివృద్ధి చేయటంలో ప్రభుత్వం విఫలం అవ్వటం అనేది చాలా విడ్డూరం. విద్యార్థులను కళాశాల యాజమాన్యం విద్యావంతుల్ని చేయడంలో వారి వంతుగా కృషి చేస్తున్న, కళాశాల భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం వారు ఎందుకు సంకోచిస్తున్నారో అర్థం కావట్లేదు. కొంతమంది దేవీపట్నం మండలంలో గల కాలేజీని గిరిజనేతర పరిసరాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని టీడీపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. 14 పంచాయతీలు ఉన్న గిరిజన ప్రాంతంలో గిరిజన, మరియు అన్ని కులాలు ఉన్న దేవీపట్నం మండలం లో కళాశాల ను ఇప్పటికీ నిర్మించకపోవడం సోషనీయంగా కనిపిస్తుదని విద్యార్ధుల తల్లి తండ్రులు ఆవేదన చెందుతున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో వెంటనే కళాశాల భవనం ని నిర్మించాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చారపు వెంకట రాయుడు వైస్ ప్రెస్సిడెంట్ కర్రీ మహేష్ నాయుడు, ఎస్ టి సెల్ అధ్యక్షుడు కుంజం శ్రీను, తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉప అధ్యక్షుడు కాకి స్వామి, గంగవరం మండల అధ్యక్షడు కుంజం సిద్దు, శివ, నిమలపురి వీరేంద్ర రెడ్డి అదడ్డతీగల సంయుక్త కార్యదర్శి నర్సీ ఎర్రయ్య, కన్నబాబు రాగల సురేష, మట్టా సందీప్, కొమరం దొరబాబు, తురస రాజ్ కుమార్, తురస ప్రసాద్, మొదలైన మండల నాయకులు మరియు టీడీపీ నాయకులు మాజీ మండల అధ్యక్షుడు తైలం గంగాధర్ రావు, జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు గొల్ల చంటిబాబు, మండల మాజీ అధ్యక్షులు మండ్రు మధుసూదన్ రావు, నియోజక వర్గ ఉపాధ్యక్షురాలు కారం పొసమ్మ, మండల జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.