రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ ప్రభుత్వం

  • పేదలపైవిద్యుత్ భారాలు తగ్గించాలి

అనంతపురము జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షుడు టి.సి వరుణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి బొమ్మల పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి నిలువునా కరెంటు కోతలతో 2 గంటలు లేక 4 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తోంది. జగన్ రెడ్డి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మీరు మీ మంత్రులు రైతులకు పగలు ఇస్తామన్న కరెంట్ లేదు రైతులకు 9 గంటల కరెంటు లేదు ఇప్పుడు రైతులకు పంట చేతికి వచ్చే టైం కావున రైతుల ఉసురు మీకు తగిలి మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. శీతాకాలము వచ్చినా వేసవి తలపించే గృహ విద్యుత్ బిల్లుభారీగా వస్తున్నాయి ప్రతినెల చార్జీలు విపరీతంగాపెంచి రాష్టప్రభుత్వం సామాన్యులపై పెనుభారము మోపుతున్నారు. కావున తక్షణమే పెంచినచార్జీలు తగ్గించాలి. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలి. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచితంగా ఇవ్వాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. విద్యుత్ సవరణ బిల్లు – 2022ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.