2022 సంవత్సరం పవన్ కళ్యాణ్ జనసేన నామ సంవత్సరంగా సాగింది

  • జనసేన పార్టీ కేలండర్ ఆవిష్కరణ

విజయవాడ, జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి, విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ చేతుల మీదుగా ఆయనకి జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, నూజివీడు నియోజకవర్గం టీం అధ్వర్యంలో జనసేన పార్టీ కేలండర్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గ టీమ్ కి ప్రత్యేకంగా అభినందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధినేత పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ వెన్న శివ శంకర్, మోబిన బేగం, ధార్మిక మండలి సభ్యురాలు నీట్ల ఉమామహేశ్వరి, నూజివీడు నియోజకవర్గ నాయకులు ఆగిరిపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ పిట్టా విజయ్ బాబు, కార్యవర్గ సభ్యులు కొండిశెట్టి శ్రీనివాస్ రావు,జలసూత్రం గోపాల్, రానిమేకల లోకేష్, మహేష్, నాని, మధు, చైతన్య, నందేశ్వర్, అనిల్, సాయి, విజయవాడ నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ 2022వ సంవత్సరం పవన్ కళ్యాణ్ జనసేన నామ సంవత్సరంగా సాగింది. ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఆపద్బాంధవుడిగా ఒక సామాజిక సంస్కర్తగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా 100 శాతం బాధ్యతలు నిర్వహించిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. రాష్ట్ర రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరిగాయి. వైయస్సార్సీపి పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారంటే ఆయన ప్రజల సమస్యలపై ఎంత బలంగా పనిచేశారో వైయస్ఆర్సీపీ నాయకులకు అర్థమైంది. ప్రజా సమస్యలు వినేందుకు జనవాణి అయిన, కౌలు రైతుల భరోసా యాత్ర, గోతులపడ్డ రోడ్ల డిజిటల్ క్యాంపెయిన్, సెంటు భూమి జగనన్న కాలనీలపై పర్యవేక్షణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, గోతులపడ్డ రోడ్లకు శ్రమదానం, ఆవిర్భావ సభతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు, మత్స్యకార భరోసా సభ, ఇప్పటం ఇలా అనేక అంశాలపై నిరంతరం పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి అంటే అతిశయోక్తి లేదు. ప్రతిపక్షం అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనే విధంగా రాష్ట్రంలో సాగింది. పవన్ కళ్యాణ్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఉత్తరాంధ్ర పర్యటనను ఇప్పటం గ్రామ సందర్శన్ను పోలీస్ శాఖ వారిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది అంటేనే పవన్ కళ్యాణ్ అంటే ఏ స్థాయిలో భయం పట్టుకుందో అర్థమవుతుంది. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నిత్యం పార్టీని క్షేత్రస్థాయిలో బలోతోపేతం చేస్తూ, పార్టీ నిర్మాణాన్ని చేపడుతూ, మత్స్యకార భరోసా సభ కోసం పాదయాత్ర చేసిన, జనవాణి ఏర్పాట్లను నిరంతరం పరిశీలించిన, కౌలు రైతులకు అండగా నిలబడేందుకు నిరంతరం స్పష్టమైన సమాచారం సేకరిస్తూ, ఆవిర్భావ సభ విజయవంతమైనందుకు అహర్నిశలు కృషి చేసిన బలమైన నాయకులు మనోహర్. వైసిపి ముక్త ఆంధ్రప్రదేశ్ తద్యం రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రజా సంక్షేమం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని మహేష్ అన్నారు.