రెల్లి కులస్థులు మీద కక్ష సాధిస్తున్న వైసీపీ ప్రభుత్వం

  • కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఉన్నపలంగా కట్టు బట్టలతో ఆడవాళ్ళని బయటకి పిలిచి అన్యాయంగా వారి ఇంటికి వెళ్లే మార్గలను గట్టులను కూల్చేశారని కన్నీరుమయమయినా రెల్లి కాలనీ మహిళలు
  • డ్రైనేజీ తవ్వకం పేరుతో ఇళ్లులను తవ్వేస్తున్నారు, డ్రైనేజీ అంతా ఇళ్ళు ముందు వేసి, కనీసం దారి లేకుండా, తాగడానికి నీరు లేకుండా చేసే వారిని మనుషులు రూపంలో ఉన్న మృగాలు అని అంటారు, పన్నులు కట్టే ప్రజల్నే పిడిస్తున్న ప్రభుత్వం పోయే రోజులు దగ్గర్లోనే ఉంది
  • 24గంటల్లో స్థానిక సమస్యకు పరిష్కరం చూపకపోతే నా సొంత నిధులతో నేను గట్లు వేయిస్తాను. పనులు పూర్తి అయ్యేవరకు మీకు అండగా ఇక్కడే ఉంటానని భరోసా ఇచ్చిన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.

గురువారం పిఠాపురం పట్టణంలో గల మంగరాంపురం దగ్గర రెల్లి కాలనీలో టౌన్ ప్లానింగ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక జనసేన నాయకలు ద్వారా సమస్య గురించి తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ హుటాహుటిన బయలుదేరి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలతో మాట్లాడి పూర్తిగా సమస్య గురించి తెలుసుకుని జేసీబీలతో జరుగు పనులను నిలిపివేయించి స్థానిక మహిళలు తరుపున అధికారులతో మాట్లాడుతూ అన్యాయంగా రెల్లి సోదరుల ఇళ్ళు దగ్గర వారి యొక్క దారులను గట్లును పూర్తిగా తొలగిస్తూ కావాలని ఇబ్బందులు పెట్టడం సరికాదని పరిమితికి మించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తీరు ఇలాగే కొనసాగితే ఉపేక్షించేది లేదని,
పిఠాపురంలో ఇన్ని సమస్యలు ఉండగా కేవలం రెల్లి కాలనీలో మా జనసేన ఫ్లెక్సీలు కట్టిన చోటనే మీరు రోడ్లు విస్తరణ చేపడతారా, వృద్ధురాలు పొట్టకూటి కోసం చేసుకునే చిరు వ్యాపారాన్ని సైతం కూల్చి వేయడానికి మనసు ఎలా వచ్చింది అని అధికారులను నిలదీశారు. అనంతరం భాదితులు, స్థానిక నాయకులతో మాట్లాడుతూ 24గంటల్లో స్థానిక సమస్యకు పరిష్కరం చూపాలి అని లేనిపక్షంలో మా సొంత నిధులతో నేను గట్లు వేయించి గతంలో ఉన్న విధంగా పనులు పూర్తి అయ్యేవరకు ఇక్కడే ఉంటాను అని భరోసా కల్పించారు. బాధితులకు అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా నిలపడుతుంది అని ఐదు నెలల్లో ప్రభుత్వం మారుతుందని జనసేన జెండాను పిఠాపురంలో కచ్చితంగా ఎగరెస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.