ప్రజల పట్ల నిబద్ధత లేదు ఓట్ల కోసమే రాజకీయం

  • కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల నిబద్ధత లేదని, ఓట్ల కోసం రాజకీయం చేయాలని తపన తప్ప ప్రజాసేవకు అర్థం తెలియదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పెంటపాడు మండలం దర్శిపర్రు, వల్లూరుపల్లి, రాచర్ల గ్రామాల్లో బుధవారం సాయంత్రం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ అందించాలనే తపన ఉన్న నాయకులు ఎన్నికల కోడ్ కంటే ముందే తాము ప్రజలకు ఇస్తానన్న సొమ్ము వారికి అందించి అప్పుడు ఎన్నికలకు సిద్ధం అంటూ తిరగాలని కానీ శవరాజకీయాలు చేసే జగన్ ఎన్నికల సమయంలో ప్రజలకు నిధులు ఇస్తామంటే ఎన్నికల నిబంధనలు ఒప్పుకోవు అని ముందుగానే తెలిసి ఆ పాపాన్ని ప్రతిపక్షాల మీద వేయచ్చనే దురాలోచనతో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాడేపల్లిగూడెంకి వచ్చి జగన్ తన శవరాజకీయాలను, కొట్రలను, కుతంత్రాలను, ఫ్యాక్షన్ రాజకీయాలు చెబితే చప్పట్లు కొడతారు తప్ప మరేం చెప్పినా తాడేపల్లిగూడెం ప్రజలు నమ్మరన్నారు. నియోజవర్గ వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ నైతిక విలువలు కూడా మరిచి పోటీలో కుతంత్రాలకు పాల్పడుతున్నారన్నారు. తన పేరుతో ఉన్న అభ్యర్థితో నామినేషన్ వేయించడంతోపాటు ఆ వ్యక్తి కోసం ఆటోలు పెట్టి ఆ శ్రీనివాసరావు ఫోటో లేకుండా గుర్తును ప్రచారం చేసి కూటమి ఓటర్లను, ప్రజలను గందరగోళానికి గురి చేసేందుకు చూస్తున్నారని తాడేపల్లిగూడెం నియోజవర్గ ఓటర్లు ఎంతో నేర్పుగా ఆ కుతంత్రాల కొట్టుకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామాల నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పూలతో హారతులతో ఘన స్వాగతం పలికారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు భారీగా హాజరయ్యారు.