పెళ్లకూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు విజయ్ మల్లాం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, 5 సంవత్సరాల అధికారంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయకపోవడం, అయినప్పటికీ తమ నాయకుడు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం అయిన వైసీపీ, నోరుకు అదుపు లేక పబ్లిసిటీ కోసం మాట్లాడుతోందని విమర్శించారు. సుబ్రహ్మణ్యం రెడ్డి ఎవరో పక్కింటి వాళ్లకు కూడా తెలియదని, మతిస్థిమితం లేకుంటే ఎర్రగడ్డకు తరలించాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. జనసేన నాయకుడిపై విమర్శలు మానుకుని, ప్రజల కోసం పనిచేస్తే వైసీపీకి కనీసం ఆ పదకొండు సీట్లు అయినా ఉంటాయని హెచ్చరించారు. ఇక వైసీపీ ప్రతిపక్షంగా అడుక్కునే స్థితికి చేరుకుందని, జనసేన పార్టీ మాత్రం ప్రజల మద్దతుతో 1 సీటు నుంచి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను గెలుచుకుని రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం రాశిందని తెలిపారు. తండ్రి లేకుంటే జగన్ రెడ్డి వార్డు మెంబర్ కూడా కాలేవని, వైసీపీ నాయకుడు ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలవడమనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. జనసేన పార్టీని గెలిపించిన తల్లి, చెల్లిలు ఎక్కడకు పోయారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి వైసీపీకి లేదని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
Share this content:
Post Comment