వైకాపా ప్రభుత్వ పాలనలో గడప గడపలో సమస్యలే

మదనపల్లె, ఈ నెల 11 నుండి వైకాపా ఎమ్మెల్యేలు చేపట్టిన గడప గడపకు వైకాపా కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యేకి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ప్రజలు ఎమ్మెల్యేలను రోడ్లమీద నిలదీసి వారిని, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌళిక వసతులు, మహిళలకు రక్షణ మహిళ లపై తరచుగా జరుగుతున్న దాడులు, ఇలా ప్రతి ఒక్క సమస్య మీద ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు .కొన్ని ప్రాంతాలలో ఎన్నికల అప్పుడు కనిపించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కనిపిస్తున్నారని నిలదీసిన రోజులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎమ్మెల్యేలను అసలు ఊర్లోకి రానివ్వడం లేదు. మురుగు కాలువలు రహదారుల నిర్మాణం చాలా ఇబ్బంది పెడుతోంది అని, చాలాచోట్ల మంచినీటి సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గళమెత్తారు. అదే విధంగా పిల్లలు చదువుకుంటున్న భవనాలు పెచ్చులు ఓడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సెలవుల్లో బడులను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చాలా అద్వానీ స్దితికి చేరుకున్నాయి, వర్షం కురిసినప్పుడు బురద నీరు నీరు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిమీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి కనీసం గుంతలను పూడ్చాలని కోరారు. నిత్యావసర ధరలు పెంచడంతోపాటు పెట్రోల్ డీజిల్ ఆర్టీసీ చార్జీలు వైకాపా ప్రభుత్వంలో ఊహించని స్థాయికి పెరిగాయని ఆదాయం లేని రాష్ట్రంలో ఎలా బతకాలి ఈ విధంగా రేట్లు పెంచారని ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించారని జనసేన పార్టి చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.