అమ్మవారి అభరణాల దొంగలను కఠినంగా శిక్షించాలి: దాసరి రాజు

ఇచ్ఛాపురం మండలం, మండపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గార పోలమ్మ ఆలయంలో.. సుమారు 500 గ్రాముల వెండి ఆభరణాలు దొంగతనం జరిగింది. తేదీ 30.4.2022 శనివారం వేకువజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ద్వారా సమాచారం తెలుసుకున్న ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఇంతకుముందు కూడా ఇలాంటి దొంగతనం జరిగిందని ఇప్పుడు ఇది జరగడం రెండవసారి అని ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు దాసరి రాజు వద్ద వాపోయారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరుగుతాయేమో అని ఆందోళన చెందుతున్నారు. దీనిని దాసరి రాజు తీవ్రంగా ఖండిస్తూ.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఇలాంటి సంఘటనలు రాష్ట్రమంతా జరుగుతున్నాయని ఆలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసం వంటివి జరుగుతున్నాయని అన్నారు. రాక్షస రాజ్యం నడుస్తోందని.. దొంగలను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పెంచి పోషిస్తోందని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ జరగడానికి దోషులను కఠినంగా శిక్షించకపోవడమే అని అన్నారు. పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసి దొంగలను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజుతో పాటూ జనసేన నాయకులు, రొక్కల భాస్కర్, కల్యా గౌడ్, రాజు, సంతోష్, సాయి కృష్ణ, ఆనంద్, కార్యకర్తలు మరియు మండపల్లి జనసేన నాయకులు పాల్గొన్నారు.