నేటి నుంచి తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలు

కరోనా లాక్‌డౌన్‌, ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నెలలుగా శ్రీవారి లడ్డూల విక్రయాన్ని నిలిపివేసిన విషయం విదితమే. లడ్డూల విక్రయాన్ని నేటి నుంచి (శనివారం) ప్రారంభిస్తున్నామని టీటీడీ అధికారి రమేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లిబర్టీలోని టీటీడీ బాలాజీభవన్‌తోపాటు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ప్రాంగణంలో కూడా తిరుమల శ్రీవారి లడ్డూలను విక్రయిస్తామని టీటీడీ హైదరాబాద్‌ విభాగం ప్రత్యేక అధికారి రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. లడ్డూల కోసం వచ్చే భక్తులు మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు.