నాకు అత్యంత విలువైన ఫొటో ఇదే: ఉపాసన

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చేసే సందడి అందరికీ తెలిసిందే. ఉపాసనకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. రామ్ చరణ్, చిరంజీవి గురించి షేర్ చేసే ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.

తాజాగా మెట్టినింటినికి ఉపాసన ఎంత ప్రాధాన్యం ఇస్తుంటుందో.. పుట్టినింటికి అంతే ప్రాధాన్యం ఇస్తుందో ఒక్క ఫోటోతో తేల్చేసింది. ఆ ఫొటోలో తన అత్తమామలు సురేఖ, చిరంజీవిలతో పాటు తన తల్లిదండ్రులు శోభ కామినేని, అనిల్ కామినేని కూడా ఉన్నారు. తనకు అత్యంత విలువైన ఫొటో ఇదేనని ఉపాసన వెల్లడించారు.

ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి కూర్చుని ఉండగా.. ఉపాసన తల్లిదండ్రులు నిల్చుని ఉన్నారు. ఇక మెగా కోడలు ఉపాసన ఓవైపు అపోలో ఫౌండేషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటారు. మరోవైపు సోషల్ మీడియాలో సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకో వైపు చేస్తూనే ఉంటారు.