నాకు పోటీ వచ్చే వ్యక్తి ఇతడే.. సోనూసూద్

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న పేరు సోనూ సూద్.. కరోనా కష్టకాలంలో సాయం కోరిన వారికి లేదనకుండా సాయం చేసి రియల్ స్టార్ గా మారిన నటుడు  సోనూసూద్. సొంత ఊర్లకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నా వారందరికీ తన సొంత డబ్బులు పెట్టుకొని వారందిని వారి ఇంటికి చేర్చారు. ఇలా లాక్ డౌన్ పీరియడ్ లో ఎందరో అభాగ్యుల కళ్ళలో ఆశాజ్యోతిగా నిలిచాడు.

అయితే తాజాగా సోనూ సూద్ ఒక పోస్ట్ చేశారు. జీవితంలో నాకు పోటీ వచ్చే వ్యక్తి ఇతనే.. అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

ఇంతకీ ఆ పోస్ట్ ఎవరిది అనే సందేహం కలుగుతోంది కదా.. సోనూసూద్‌ కుమారుడు ఇషాన్‌ సూద్‌ నిన్న పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సోనూసూద్‌ తన కుమారుడికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్ట్ చేశారు. ”నా హీరో ఇషాన్ సూద్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఫైనల్‌గా నాకు ఫిట్‌నెస్ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు.” అని తెలుపుతూ.. సేమ్‌ టు సేమ్‌ డ్రస్సు వేసుకుని బాడీని ఎక్స్‌పోజ్ చేస్తున్న ఇద్దరి ఫోటోను సోనూ పోస్ట్ చేశారు. ఇషాన్ చిన్నప్పటి ఫొటో ఇది. ఈ పిక్‌కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.