ఈసారి “జనసేన జన ప్రభంజనాన్ని” చూడబోతున్నాం

  • బత్తుల దంపతులకు శ్రీరంగపట్నం గ్రామంలో పెద్దఎత్తున హారతులు పట్టి ఘన స్వాగతం పలికిన మహిళలు
  • “జనం కోసం జనసేన” “మహా పాదయాత్ర’ 50వ రోజు

రాజానగరం, “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” లో భాగంగా మంగళవారం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నంలో గ్రామంలో జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి “మహాపాదయాత్ర” గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ, ప్రతి ఒక్కరినీ, ఈసారి జనసేన పార్టీకి ఓటేసి, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ… ప్రజల ఆదరాభిమానాలతో జనసైనికులు ఉత్సాహం, కేరింతలతో కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాబోయేది జనసేన ప్రభుత్వమని, ఈసారి పవన్ కళ్యాణ్ జన ప్రభంజనాన్ని సృష్టించబోతున్నారని, ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారన్నారు.ఈ మహాపాదయాత్రలో పెద్దఎత్తున శ్రీరంగపట్నం జనసేన నేతలు, జనసైనికులు పాల్గొన్నారు.