ప్రజాధనాన్ని దోచినవారు చరిత్రలో “కొట్టు”కు పోయారు

*గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం
*రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, ప్రజాధనాన్ని దోచుకుని దుర్వినియోగం చేసిన నాయకులు చరిత్రలో “కొట్టు”కుపోయారని రాష్ట్ర విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ నిధులను కేటాయిస్తున్నామని అన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ప్రభుత్వ నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ సాయపడాలని అటువంటి వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. చెత్త నుండి సంపద సేకరించే విధంగా సచివాలయ ఉద్యోగస్తులు ఆలోచన విధానాలు ఉండాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని , ప్రతిరోజు సేకరించి చెత్త నుండి ప్లాస్టిక్ను వేరుచేసి 40 రోజులు పాటు మట్టిలో విలువ చేస్తే రైతులకు ఉపయోగకరమైన కంపోస్ట్ సంపద ను అందించగలుగుతామని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దత్తత గ్రామాల దిశగా అధికారులు ప్రజలను ప్రేరేపించాలని తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి సంవత్సర క్రితం గ్రామాల అనుసంధానం లేకుండా దుర్భర స్థితిలో ఉన్న రోడ్లకు కోటపాడు, విప్పరు రోడ్ల అభివృద్ధికి కోటి రూపాయలను అందించి కేంద్రమంత్రి గోపిరాజు శ్రీనివాస్ వర్మ అభివృద్ధి పథంలో నడిపారని అన్నారు. పాదయాత్రలో గుర్తించిన ప్రతి సమస్యను తాను పదవిలో ఉన్న సమయంలో పూర్తి చేస్తానని అందులో భాగంగా రాచర్ల రోడ్ అభివృద్ధి, నియోజకవర్గంలో డ్రైనేజ్ అభివృద్ధి వంటి పనులను కేంద్రం మరియు రాష్ట్ర నిధులతో ప్రణాళిక బద్ధంగా ముగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుల వారితోపాటు పెంటపాడు మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, గ్రామ సర్పంచ్ ల తోపాటు డివిజనల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, మండల తహసీల్దార్ టి. రాజరాజేశ్వరి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి బాలాజీ వెంకటరమణ లతో పాటు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా మరియు రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మండల మహిళా సమాఖ్య, ఎలక్ట్రికల్, హౌసింగ్, పోలీస్ శాఖ మరియు ఇతర విభాగాలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment