విశాఖపట్నం: ప్రపంచ యోగా దినోత్సవం-2025 సందర్భంగా డేటు 21.06.25న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్) వేదికగా అవమానకర పోస్టులు షేర్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, పోలీసు శాఖ వారు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 24.06.25న ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేశారు.
Share this content:
Post Comment