పలాస నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

పలాస నియోజకవర్గం: సంక్రాతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు మన ఊరు – మన ఆట కార్యక్రమంలో భాగంగా పలాస నియోజకవర్గం కేదారిపురం పంచాయతీ ఈదురాపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. కేదారిపురం పంచాయతీ మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటిల్లో పాల్గున్నారు. ఈ ముగ్గులపోటిల్లో ఫస్ట్ ప్రైజ్ ను తులుగు పార్వతి, సెకండ్ ప్రైజ్ ను బిల్లింగి జాన్షి రాణి, థర్డ్ ప్రైజ్ ను ఓట్టికుల్ల రంజిత, ఫోర్త్ ప్రైజ్ ను కణగల రుక్మిణి, ఫిఫ్త్ ప్రైజ్ ను పోలాకి అమృత, సిక్స్త్ ప్రైజ్ ను కణగల లావణ్య గెలుపొందడం జరిగింది. విజేతలకు బహుమతులు అందించండం జరిగింది. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మజ్జి భాస్కరరావు మాట్లాడుతూ సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఈ పండుగను వీర మహిళలు అందరి కలిసి జరుపుకోవాలని, పండగను అందరూ కలిసి జరుపుకోవాలని ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మన ఊరు మన ఆట కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మొత్తం నిర్వహించాలని ఆదేశాలివ్వాడం వలన ఈరోజు ఈదురపల్లి గ్రామమంలో ముగ్గుల పోటీలు నిర్వహించం. ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగు ప్రజలు కలిసి పండగలు చేసుకొనే రోజులు పోయాయి. కాబట్టి వీర మహిళలు, మహిళలు అందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, 2024లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడానికి మీ ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. మజ్జి శ్రీకాంత్ పలాస మండలం నాయకులు రుంకు తరకేశ్వరరావు, పైల నాగార్జున, జనసేన పార్టీ పలాస నియోజకవర్గం లీగల్ సెల్ కోఆర్డినేటర్ పైల చిట్టిబాబు, శ్రీకాకుళం జిల్లా మాజీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు కంచరాన అనిల్, మందస మండలం నాయకులు తిరుపతి గౌడ, కేదారిపురం పంచాయతీ నాయకులు పడ్డ రవి కుమార్, పైల కూర్మా రావు, హనుమంతు జనార్ధన్, ఒట్టికుల్ల మోహనరావు, గ్రామ పెద్దలు పోలాకి ఎత్తిరాజు, పోలాకి తిరుపతి, రుంకు లోకనాధం, పోలాకి కృష్ణరావు, ఎన్ని హరికృష్ణ, పైల ఖాగేశ్వరరావు, కణగల విశ్వనాధం, జనసైనికులు రట్టి దుర్గ, పైల వాసు, ఆస్పన్న ఫాల్గుణ రావు, ఎన్ని నిఖిల్, తామరపల్లి పాపారావు, అంకటాల శ్రీను, పైల గోపి, పైల ఉదయ శంకర్, రుంకు లక్ష్మణ్, పడ్డ త్యాగరాజు, కొండేటి మేఘనాథ్, తులుగు దివాకర్, పైల జోగారావు, గ్రామ ప్రజలు, మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.