పుల్వామా ఉగ్ర దాడికి మూడేళ్లు: జనసేన పార్టి ఘన నివాళి

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ ఆదేశాల మేరకు అదాలత సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద జనసైనికులు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు బైరి వంశీ మాట్లాడుతూ 2019లో ఈ రోజున పుల్వామాలో అమరులైన వారందరికీ నేను నివాళులర్పిస్తునము మరియు మన దేశానికి వారు చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటున్నాను. వారి శౌర్యం మరియు అత్యున్నత త్యాగం ప్రతి భారతీయుడిని బలమైన మరియు సంపన్న దేశం కోసం పని చేయడానికి ప్రేరేపిస్తుంది” అని పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సైనిక బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన బాంబుదాడిలో 40 మంది భారత వీర సైనికులు అమరులయ్యారు జమ్ము నుంచి 78 వాహనాల్లో 2500 మంది సీఆర్పీఎఫ్ బలగాలు శ్రీనగర్ బయలుదేరగా, జాతీయ రహదారి 44 పై జైషే మహ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈదాడిలో 76వ బెటాలియన్ కు చెందిన 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది అసువులు బాశారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఈదాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. దీంతో కన్నెర్రజేసిన భారత్..ఉగ్రవాదులు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతీకారం తీర్చుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ఉపాఅధ్యక్షులు తాళ్లపెల్లి బాలు, ప్రధాన కార్యదర్శి జన్ను ప్రవీణ్, కార్యదర్శులు ఎంసాని హరీష్, అయిలేని సంతోష్ రెడ్డి, యువజన విభాగం నాయకులు, కమిద్రి అన్వేష్, లైదేల్లా రాకేష్, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.