ఘనంగా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

  • గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ, మరియు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో వికలాంగులకు అన్నదానం కార్యక్రమం

ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నిస్వార్థ సేవకుడని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు గురువారం నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పెద్ద ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ వేములపాటి అజయ్ కుమార్ గొప్ప నాయకుడని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేత జనసేన పార్టీలో ఉండడం అదృష్టంగా భావించాలన్నారు.జిల్లాలో పార్టీని ఆయన ముందుండి నడిపించడం వల్ల పార్టీ బలపడింది అన్నారు.మన పార్టీకి మంచి సలహాలు సూచనలు అందించడంలో ఆయన సఫలీకృతులు అయ్యారు అని చెప్పారు. వేములపాటి అజయ్ కుమార్ పేదల పక్షపాతి అని తెలిపారు. అందుకే ఆయన సేవలను పార్టీ గుర్తించింది అన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని నూనె మల్లికార్జున యాదవ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, పి చంద్రశేఖరెడ్డి, బి సుధామాధవ్, గుడి హరిరెడ్డి, కాకు మురళి, ఖరీం, మార్కెట్ సురేష్, కృష్ణారెడ్డి, వర్షా చలం రాజేష్, డి పోలయ్య, గుర్రం కిషోర్, వెంకట్ యాదవ్, మనోజ్, ప్రశాంత్, జి శ్రీకాంత్, పి శ్రీకాంత్, ఆఫీస్ ఇంచార్జి జమీర్, ప్రసన్న, సౌమ్య, మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment