టిడ్కో గృహాల అభివృద్ధికి కృషి

నెల్లూరు, టిడ్కో గృహాల అభివృద్ధికి టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. వేములపాటి సూచన మేరకు శనివారం అల్లిపురంలోని టిడ్కో గృహాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ ప్రాంతంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు. అపరశుభ్రంగా ఉన్న వాటిని పరిశీలించి చెట్ల తొలగింపు, చెత్త చెదరాలను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడు లేవని ఆయన గుర్తు చేశారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు, ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టేమన్నారు. టిడ్కో గృహాలలో నివసించే ప్రజలకు జనసేన పార్టీ సహాయ సహకారాలు అందించునున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండడం అదృష్టంగా భావించాలన్నారు. కూటమితోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని నూనె మల్లికార్జున యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడ్కో డీ రంగయ్య, శానిటైజ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్, వెంకట్ యాదవ్, దాసరి పోలయ్య, వర్షాచలం రాజేష్, ప్రసన, శాంతి కళ, వరలక్ష్మి, మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-03-29-at-8.15.00-PM-2-1024x683 టిడ్కో గృహాల అభివృద్ధికి కృషి

Share this content:

Post Comment