ఉద్దానంలో పెద్దపులి సంచారం – సమస్యను పరిష్కరించాలి జనసేన డిమాండ్

ఇచ్చ్చాపురం: ఉద్దానంలో బ్రతకడానికే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో 10 రోజులుగా పెద్ద పులి రూపంలో మరో సమస్య మనల్ని చుట్టూ ముట్టిందని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు పేర్కొన్నారు. ఆదివారం దాసరి రాజు మీడియా ముఖంగా మాట్లాడుతూ గత పది రోజులుగా పెద్దపులి సంచారం ఉందని ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఇన్ని రోజులుగా సమస్యను గుర్తించి సమాచారం అందివ్వడం తప్ప పరిస్కారపు ఛాయలు ఎక్కడా లేవు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా ఫారెస్ట్ అధికారులను, ఆధునిక యంత్రాంగాలను ఉపయోగించి పులి/పులుల జాడని కనిపెట్టి ఉద్దానం సమస్యను పరిష్కరించాలని జనసేన పార్టీ తరపున కోరుచున్నామని దాసరి రాజు పేర్కొన్నారు.