*అధికారుల సమీక్ష
కొవ్వూరు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం, కాపవరం ఏఎంసీ ప్రాంగణంలో జరిగే సభా స్థలాన్ని మరియు గోవర్ధనగిరి మెట్ట వద్ద హెలిపాడ్ నిర్మాణ పనులను శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, డీఎస్పీ దేవా కుమార్, ఆర్డీవో రాణి సుష్మిత, టూ మెన్ కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు సుంకర సత్తిబాబు, గంగుమళ్ళ స్వామి, పోలిశెట్టి శివ, మజ్జి శేఖర్ కూడా హాజరయ్యారు.
Share this content:
Post Comment