రాధే శ్యామ్ టీజర్‌కు టైం ఫిక్స్ ..!

ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్. 1980 దశకంలో యూరప్‌ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కించారు. ప్రేమికుడిగా ప్రభాస్‌ను వినూత్న పంథాలో ఆవిష్కరిస్తుంది. విక్రమాదిత్య పాత్రలో ఆయన సందడి చేయనున్నాడు. పూజా .. ప్రేరణ అనే పాత్రలో కనిపించనుంది.

రాధేశ్యామ్ అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 14 ఉదయం 9.18 ని.లకు సినిమా గ్లిమ్ప్స్‌ (లఘు వీడియో)ను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. పునర్జన్మల నేపథ్యంలో ఈ మూవీ కథ మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని తెలుస్తుంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్‌కి చేరుకుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.