ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న తిరుపతి అనూష

విజయవాడ: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎన్నికల్లో జనసేన పార్టీ మహిళా నాయకురాలు తిరుపతి అనూష మరియు జనసేన పార్టీ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలోని ఓటింగ్ కేంద్రానికి చేరుకుని ఆమె ఓటు హక్కును ఉపయోగించారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. విద్యావంతులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు సమాజ మార్పులో కీలక పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్యంలో తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజాసేవకు అంకితమై పనిచేసే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, ఇది మంచి నాయకత్వాన్ని ఎంచుకునే అవకాశమని తిరుపతి అనూష అన్నారు.

Share this content:

Post Comment