తిరుపతి ఉప ఎన్నిక.. ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామన్న పురందేశ్వరి

తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఎవరు పోటీ చేస్తారన్న విషయంలో నెలకొన్న సందిగ్ధతకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తెరదించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి బరిలోకి దిగుతారని ఆమె పేర్కొన్నారు. నిన్న తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

గత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు నకిలీ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేశాయని ఆరోపించారు. టీటీడీ భూమలను ప్రభుత్వం ఏకపక్షంగా విక్రయిస్తుంటే బీజేపీ అడ్డుకుందని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇసుక పాలసీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.