తిరుపతి జిల్లా జనసేన నాయకులు మీడియా సమావేశం

తిరుపతి, జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని కలిసి న్యాయం చెయ్యాలని కోరిన రేణిగుంట మండలం తారకరామానగర్ కి చెందిన 87 ఏళ్ల రాములమ్మ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా, జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ వారి ఇంటి వద్దకు వెళ్ళి స్థానికులతో వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. మంగళవారం సాక్షి పేపర్లో జనవాణి కార్యక్రమం గురించి విషం చిమ్మే రాతలు రాయడం సిగ్గు చేటు, కలెక్టర్ వాస్తవాలు వెల్లడించారని ప్రగల్భాలు రాశారు. ఈ విషయంపై తిరుపతి సింధూర పార్క్ హోటల్ నందు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా, తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మార్వో అండతో ఇలాంటి కబ్జాలు చేస్తుంటే, ఎమ్మార్వో పంపిన రిపోర్టులను కలెక్టర్ రిపోర్ట్ గా ఇవ్వడం ఏంటి..? ఎమ్మార్వో నే అక్రమాలు చేస్తుంటే ఎమ్మార్వో ఎలాంటి రిపోర్ట్ ఇవ్వగలరు. వీళ్ళు సృష్టించిన ఒక అనుభవ పత్రాన్ని పెట్టుకుని, అది కుడా వై.సి.పి సోషల్ మీడియాలో పెట్టిన ఎంజాయిమెంట్ పత్రాన్ని కలెక్టర్ సాక్ష్యంగా, ఎంక్వైరీ చేసినట్టు పెట్టడం సిగ్గు చేటు!! 2004లో పట్టా ఇస్తే, 2010లో రాజీవ్ హౌసింగ్ లోన్ లో వారు కట్టుకున్న ఇంటికి అకౌంట్లో గవర్నమెంట్ డబ్బులు వేస్తే ఇల్లు కట్టుకోలేదనీ పట్టా రద్దు చేశామని చెప్పడం ఏంటి.! వాస్తవాలు ఎంక్వైరీ చేశామని కలెక్టర్ చెప్పాలంటే, 2018 ఇప్పుడు ఎవరికీ ఇచ్చామని చెబుతున్నారో అతనికి ఇచ్చిన పట్టాకి సంభందించిన ఎమ్మార్వో ఆఫీస్లో పట్టా రిజిస్టర్లో ఉన్న వివరాలు ఎందుకు ఇవ్వరు? ఎంజాయిమెంట్ లెటర్ ఇచ్చినపుడు ఎమ్మార్వో ఆఫీస్ లో ఎంజాయిమెంట్ రిజిస్టర్ లో ఉన్న వివరాలు ఎందుకు ఇవ్వరు? 2018 ఎంజాయిమెంట్ లెటర్ లో 5 సంవత్సరాలుగా నివాసం ఉన్నాడని సర్టిఫికేట్ ఇచ్చామన్నారు? 2018 లో రద్దు చేసి, 2018 లో కొత్త వారికి ఇస్తే 5 సంవత్సరాలు ఎలా అవుతాయి? 2018 నుండి అతను అక్కడ నివాసం ఉంటే 2022 ఫిబ్రవరి వరకు ఇంటికి కరెంట్ కనెక్షన్ ఎందుకు లేదు? ఇవ్వన్నీ కలెక్టర్ స్థాయి వ్యక్తులు కూడా పరిశీలించకుండా వైసీపీ సోషల్ మీడియాలో వచ్చిన డాక్యుమెంట్లను ఆధారంగా సర్టిఫై చెయ్యడం సిగ్గు చేటు, కబ్జా చేసిన వల్ల దగ్గర ఉన్న వివరాలతో సర్టిఫై చెయ్యడం కాదు. మీ రెవెన్యూ రికార్డులలో ఉన్న డాక్యుమెంట్లు ఇస్తే నిజానిజాలు తెలుస్తుంది. కలెక్టర్ ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుని న్యాయం చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. కబ్జా చేసినవాడు వైసిపి కార్యకర్త కాదు అని ఎమ్మార్వో, కలెక్టర్ సర్టిఫై చెయ్యడం సిగ్గు చేటు. వైసిపి డేటాబేస్ ఎమ్మార్వో, కలెక్టర్ మెయింటైన్ చేస్తున్నారా..? బాధితులకు న్యాయం చెయ్యడం మానేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి ఎవ్వరి దగ్గర న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళారు. త్వరలో న్యాయం జరగకపోతే ఎవరైతే గతంలో పని చేసిన ఎమ్మార్వో నరసింహులు నాయుడు సంతకంతో దొంగ ఎంజాయిమెంట్ లెటర్లు ఇస్తున్నారో ఆ ఎమ్మార్వో నరసింహులు ఇళ్లు ముట్టడించి నిజానిజాలు వెలికి తియ్యల్సి వస్తుందని, ఇలాంటి కబ్జాలు స్థానిక ఎమ్మెల్యే, అనుచరులు రేణిగుంట కుర్రకాల్వా, తారకరామనగర్ లో దాదాపు 2000 ఇంటి పట్టాలు, శ్రీకాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్ కాలనీలో 2000 ఇంటి పట్టాలు వైసీపీ కార్యాలయంలో దొంగ ఎంజోయెంట్ లెట్టర్లు ఇస్తూ 20,000 ఇస్తే కరెంట్ కనెక్షన్, 50,000 ఇస్తే పంచాయతీ పన్ను రసీదులు ఇస్తూ బారీ కుంభకోణం ఎమ్మెల్యే చేస్తున్నాడు, ఆధారాలతో బహిరంగంగా నిరూపిస్తుంది దమ్ము ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యేకి సవాలు విసురుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, సమ్యుక్త కార్యదర్శి కీర్తి, ఆనంద్, చందు చౌదరి పాల్గొన్నారు.