జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన తిరుపతి జనసేన

  • సామాన్యుడి గళం వినిపించేలా జనసేన జనవాణి కార్యక్రమం

తిరుపతి, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలలో సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈనెల 21 వ తీదీ ఆదివారం జనసేనానికి జనవాణి సభలో వినతి పత్రాలను అందజేయాలని జనసేన నేతలు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, బత్తెన మదుబాబు, సుమన్ బాబు, కొండా రాజమోహన్, పార్థు, లక్ష్మి, రవి, మురళి, సాయి తదితరులతో కలిసి జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. డాక్టర్ హరి ప్రసాద్, కిరణ్ మాట్లాడుతూ… సీఎం జగన్ అడ్డాపై మా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధితులను ఆదుకోవడానికి వస్తున్నారని వెల్లడించారు. సాక్షాత్తు సీఎం సొంత ఊరు పులివెందులలో 14 మంది అలాగే కడప జిల్లాలో 175 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, సొంత జిల్లాలో కౌలు రైతులను సీఎం జగన్ ఆదుకోలేదని విమర్శించారు. బాధిత కౌలు రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సొంత నిధులను విరాళంగా ఇచ్చి ఆదుకోనున్నారని కొనియాడారు. రాష్ట్రంలో పాలక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా వారి సొంత నిధులను కష్టాలలో ఉన్న బాధితులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ రాక్షస రాజ్యంలో జనం పడుతున్న కష్టాలను జనవాణిలో తెలియజేయవచ్చునన్నారు. తిరుమల కొండపైన, కింద తిరుపతితోపాటు సీమ జిల్లాలలో బడి, గుడి ఇతర ఏ చిన్న సమస్య అయినా ఈ జనవాణి సభలో అర్జీల రూపంలో అందజేయ వచ్చునని పిలుపునిచ్చారు. కడప జిల్లా పర్యటనను శనివారం పూర్తి చేసుకుని శనివారం రాత్రి తిరుపతిలోని తాజ్ హోటల్ లో పవన్ కళ్యాణ్ బస చేస్తారని, ఆదివారం ఉదయం 8:30 గంటలకు స్థానిక హైవే లోని బాలాజీ డైరీ ఎదురుగా ఉన్న(జిఆర్ఆర్) కన్వెన్షన్ హాల్ నందు జనవాణి సభను నిర్వహిస్తారని ఎవరైనా వారి సమస్యలను అర్జీల రూపంలో తమ జనసేనానికి అందించవచ్చునని కోరారు. మండల స్థాయిలో సమస్యలు ఉంటే జనసేన పార్టీ ఆ ప్రాంతం ఇంచార్జ్ లకు కూడా తెలియజేయవచ్చునని తెలిపారు. అదేవిధంగా ఆదివారం తాజ్ హోటల్ వద్ద నుంచి ఉదయం 8:30 గంటలకు భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ తో కలిసి కన్వెన్షన్ హాల్ కు చేరుకుంటామని జనశ్రేణులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.