అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికిన తిరుపతి జనసేన

“న్యాయస్థానం టు దేవస్థానం” పాదయాత్రగా తిరుపతికి చేరుకున్న అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికిన జనసేన

అమరావతి నుంచి పాదయాత్రగా తిరుపతి చేరుకున్న అమరావతి రైతులకు ఘనస్వాగతం తెలియజేసిన చిత్తూరు జిల్లా జనసేన పార్టీ. ఈ కార్యక్రమంలో పది నియోజకవర్గాల జనసేన పార్టీ ఇంచార్జ్ లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలుపుతూ వారితో పాదయాత్రలో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గతంలో మూడు రాజధానులను ముక్తకంఠంతో ఖండించి అదేవిధంగా అమరావతికి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నుంచి వారికి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగిందని తెలియజేశారు.

తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గతంలో కూడా నెల్లూరు జిల్లాలో మా ఫాఛ్ చైర్మన్ మనోహర్ 13 జిల్లాల జనసేన నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలియజేయడం జరిగింది అందులో భాగంగా సోమవారం తిరుపతికి పాదయాత్రగా వస్తున్న రైతులకు భారీగా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని అమరావతి రైతు సోదరులకు స్వాగతం తెలియజేశామని పేర్కొన్నారు.

జనసేన నేతలు మాట్లాడుతూ తమ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాము అమరావతి అన్నదాతల, సంకల్ప సాధనలో పాలు పంచుకుని, వారి అభీష్టాలను నెరవేర్చే దిశగా అండగా నిలుస్తామని అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. అమరావతి అన్నదాతలు భూములను సైతం త్యాగం చేసి.. త్యాగమూర్తులుగా నిలిచిన.. రైతన్నలు సోమవారం అమరావతి నుండి పాదయాత్రగా నలభై మూడు రోజులు దాటి.. తిరుపతి ఆటోనగర్ కు చేరుకున్నారు వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు.