తిరుపతి వైసీపీ భూకబ్జాదారులు మహిళపై దాడి

తిరుపతిలో వైసీపీ నేతల భూకబ్జాలు మితిమీరిపోతున్నాయి. భూ కబ్జాలకు పాల్పడి స్థానిక మహిళపై దాడి చేసిన వైసిపి శ్రేణులు. రుయా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలను మంగళవారం జనసేన-టిడిపి నేతలు ఊకా విజయ్ కుమార్, కిరణ్ రాయల్ లు పరామర్శించారు. ఈ దాడిని వారు తీవ్రంగా ఖండించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు రానున్న ఎలక్షన్లలో జనసేన, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రానున్నందున, ఎలక్షన్లకు ముందే తిరుపతి పరిసర ప్రాంతాలలో ఉన్న డీకేటి, ఇతర దేశాలలో ఉన్న ఎన్నారై, మహిళల స్థలాలను కబ్జాలు చేస్తూ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని కొందరు వైసీపీ నేతలు చూస్తున్నారన్నారు. తిరుపతిని అభివృద్ధి చేశామని పదేపదే చెబుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఈ భూకబ్జాలను ఎందుకు అరికట్టడం లేదని, స్థానిక ఉపాధ్యాయ నగర్ లో సుజాతమ్మ అనే మహిళపై వైసిపి కి చెందిన భూ కబ్జాదారులు దాడి చేస్త ఈ సంఘటనను ఎందుకు ఖండించలేదని వారు ప్రశ్నించారు. రానున్న మా ఉమ్మడి కొత్త ప్రభుత్వంలో తిరుపతి ప్రజలకు అండగా ఉంటామని, కొందరు వైసీపీ నేతలు చేస్తున్న భూకబ్జాలను కచ్చితంగా అరికడుతామని, స్థానిక ప్రజలకు కిరణ్, విజయ్ కుమార్ లు హామీ ఇచ్చారు. భూ హక్కుల పరిరక్షణ అఖిలపక్ష కమిటీ సభ్యులు గుట్టా నాగరాజ రాయల్ మాట్లాడుతూ తిరుపతిలో భూకబ్జాలను అరికట్టడమే ధ్యేయంగా కమిటీని ఏర్పాటు చేశామని, బాధితులకు అండగా ఉంటామని, భూ కబ్జాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి నేతలు బాబ్జి, హేమ్ కుమార్, కొండా రాజమోహన్, మునస్వామి, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, వినోద్, సెల్వ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.