పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుంచి టైటిట్ సాంగ్ రిలీజ్..
మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. పవన్ కల్యాణ్, రానా ఈ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కి రీమేక్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. లాలా భీమ్లా అంటూ కొనసాగుతోన్న ఈ పాట అభిమానులను అలరిస్తోంది.
ఈ పాటకు సాహిత్యం త్రివిక్రమ్ అందించారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు సంబంధించిన ఫొటోలను కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.