టిట్కో గృహాలు తక్షణమే పేదలకు అందించాలి

నూజివీడు: జనవరి లోపు టిడ్కో ఇళ్లు ఇస్తాం అని పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇదే పాట పాడుతున్నారు. అధికారులు మీరు అన్న మాట నిలబెట్టుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని ఎం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి సంక్రాంతి లోపు టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందించక పోతే నూజివీడులో లబ్ధిదారులతో ధర్నా చేస్తాం అధికారులు ప్రభుత్వం పేదలు పై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ అన్యాయం చేస్తుంది. నాలుగున్నర ఏళ్లలో ఒక టిడ్కో ఇల్లు ప్రభుత్వం పేదలకుఇవ్వలేదు. నూజివీడు పట్టణంలో నిర్మించిన టిట్కో గృహాలు తక్షణమే పేదలకు అందించాలని, గత ప్రభుత్వ హయాంలో నూజివీడు పట్టణంలో 3070 గృహాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అయితే 2668 నిర్మాణాలు 80 శాతం పూర్తి చేసి మిగిలిన 20 శాతాన్ని పూర్తి చేసి పేదలకు ఇల్లు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వం మారింది. గడిచిన మూడున్నర సంవత్సర కాలంగా మిగిలి ఉన్న 20 శాతం పనులు పూర్తి చేసి పేదలకు అందించవలసిన ఈ ప్రభుత్వం ఇంతవరకు వాటి పై శ్రద్ధ పెట్టడం లేదని ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు టిట్కో గృహాలు పేదలకు అందించాలని కలెక్టర్, సబ్ కలెక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాలు అందిస్తున్నా కూడా నిర్మాణాలు పూర్తి చేయటం లేదని, ఎప్పుడు అడిగినా దసరాకి దీపావళి కి అని సంక్రాంతి కనీ అందిస్తామని ఒకసారి, డిసెంబర్లో అందిస్తామని ఒకసారి నేడు జనవరిలో అందిస్తామని తెలియజేస్తున్నారు.. దసరా దీపావళి పండగలు వచ్చి వెళ్లి పోతున్నాయి గాని ఒక అడుగు ముందుకు పడడం లేదు ప్రభుత్వ మాటలు చూస్తే కోటలు దాటుతున్నయ్ గాని అడుగు గడప దాటడం లేదు. ఇప్పుడు డిసెంబర్ దాటుతున్నా వచ్చిన అతిగతి లేదు. అసలు టిట్కో గృహాల వాస్తవ పరిస్థితిని గత కొన్నిరోజులు క్రితం జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుసుకోవడం జరిగింది. మునిసిపల్ అధికారులను కలసి అడగడం జరిగింది. వారు జనవరి అన్నారు. టిడ్కో ఇల్లు విషయంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏ పని వైసీపీ ప్రభుత్వం చెయ్యలేదు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. బాధితులు తరుపున జనసేన పార్టీ పెద్ద ఎత్తున్న పోరాడతాము ప్రభుత్వ అసమర్థత ను ఎండగడతాము. గతంలో గృహాలకు డబ్బులు కట్టించుకునేటప్పుడు టిట్కో గృహాల కలిగిన ఏరియాలో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్కు స్కూలు ఆసుపత్రి లాంటి సౌకర్యాలు కలిగిస్తామని పేదల దగ్గర నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు వసూలు చేశారు. కానీ నేటికీ కూడా గృహాలు అందించకపోవడం వల్ల పేదలందరూ చాలా ఇబ్బంది గురవుతారు అని తక్షణమే పేదలందరికీ ఇళ్ల ఇవ్వాలి. ఇవ్వకపోతే జనసేన పార్టీ తరుపున నూజివీడులో లబ్ధిదారులతో ధర్నా చేస్తాం అని సునీల్ కుమార్ తెలియచేసారు.