నేడు సీజేఐ ఎన్వీ రమణ పుట్టినరోజు… శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే అమూల్యమైన తీర్పులనిచ్చి మీదైన ఒరవడిని పరిచయం చేశారు. మీ హుందాతనం, వృత్తి పట్ల మీకున్న అంకిత భావం రేపటి తరానికి ఆదర్శం కావాలని, మీరు మరింత కాలం దేశానికి సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.