శ్రీశైలంలో నేడు కుంభోత్సవం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈరోజు కుంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేడు జరగాల్సిన కుంభోత్సవ వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీ భమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో కుంభోత్సవంలో భాగంగా అర్చకులు, భక్తులు సాత్విక బలిని ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా గుమ్మడికాయాలు,నిమ్మకాయలతో పాటు అన్న రాశిని స్వామికి సమర్పించనున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని నిమ్మకాయలతో పాటు వివిధ రకాల పుష్పాలు, వేపాకులు, వేప మండలతో సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా కొద్ది సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.