నేడు సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు.. పార్టీ శ్రేణుల సేవా కార్యక్రమాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు సిద్దమయ్యారు. జగన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు, సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో హామీలను నెరవర్చుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు సీఎం జగన్‌.

అభిమాన నేత పుట్టిన రోజు సందర్భంగా పార్టీ నేతలు, అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ పాలన సాఫిగా జరగాలని ఆకాంక్షలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.

కాగా, సోమవారం సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమం సీఎం జగన్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.