జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, చిత్రాడ వద్ద జరగనున్న భహిరంగ సభకు సన్నాహకాల్లో భాగంగా, అమలాపురానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌరసఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం రాబోతున్నారని జనసేన నాయకులు నల్లా శ్రీధర్ తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, ఆవిర్భావ వేడుక అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ బండారు శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. నియోజకవర్గం జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని శ్రీధర్ కోరారు. ఈ సభ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ వాసవి కనక్యాపరమేశ్వరి వైశ్య సంఘ పచ్చిగొళ్ళ జనార్ధనరావు కళ్యాణమండపం నందు జరగనుంది.
Share this content:
Post Comment