నాడు ఉద్యోగులను నమ్మించి నేడు నిట్టనిలువునా ముంచిన ముఖ్యమంత్రి: డా.యుగంధర్ పొన్న

చిత్తూరు జిల్లా, నాడు ఉద్యోగులను, ఉపాధ్యాయులను, కార్మికులను రకరకాల ప్రలోభాలకు గురి చేసి, అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, నేడు వారిని ఆర్ధికంగా నష్టపరచి ఆత్మక్షోభకు గురిచేసిందని నియోజకవర్గం ఇంచార్జి డా.యుగంధర్ పొన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంపు అనేది ఉద్యోగికి సర్వసాధారణం. జగన్ రెడ్డి ప్రభుత్వం తన రాజకీయ చతురతను ఉద్యోగుల జీతాల విషయంలో ప్రదర్శించడం బాధాకరం. పీఆర్సీ అమలు చేస్తే కనీసం వెయ్యి రూపాయలు పెరగక పోగా, ప్రతి ఉద్యోగి కూడా రెండు వేల నుండి పది వేల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. ఉద్యోగులు ఎంతో పోరాడి సాధించుకున్న హెచ్ఆర్ఏ స్లాబులు 12, 14.5, 20, 30 లను 8, 16 కు తగ్గించి వారిని మనో వేదనకు గురి చేయడం తగదు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సిపిఎస్ ను మూడు సంవత్సరాలైనా పట్టించుకోక పోవడం ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. ఉద్యోగుల తరపున మేము పోరాటాలకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అర్ధరాత్రి పూట అడ్డుగోలు జీవోలను రద్దు చేసి ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన వేతన సవరణ జరగాలని డిమాండ్ చేస్తున్నామని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, గౌరవ అధ్యక్షులు మధు, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, రాఘవ, ప్రధాన కార్యదర్సులు మోహన్, ముని, ఉపాధ్యక్షులు సతీష్, సంయుక్త కార్యదర్శి మహేష్, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, కార్వేటి నగరం టౌన్ కమిటి అధ్యక్షులు గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి, జనసేన నాయకులు వేణు, శరత్, ప్రశాంత్, ముత్తు, గాంధీ, ప్రవీణ్, జీవన్, బిజెపి మండల అధ్యక్షులు తిరుమల్, హనుమంత రెడ్డి, జనసైనికులు పాల్గొన్నారు.