నేటి యువత అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలి- మహనీయుల చిత్రపటాలకు ఘన నివాళి

నెల్లూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతిని, పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మను క్రాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జనసేన జిల్లా కార్యాలయంలో ఆయన జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గి శెట్టి సుజయ్ బాబు, జన సైనికులతో కలిసి అల్లూరి సీతారామరాజు, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా వారి చిత్ర పటాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలను చూసి సహించలేక 27 ఏళ్ల చిన్న వయస్సులో ప్రజల కోసం పోరాటాన్ని ప్రారంభించి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన గొప్ప ధీరుడు అల్లూరి అని కొనియాడారు. బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచిన విప్లవ జ్యోతి అల్లూరి అన్నారు. ఆర్య వైశుల ఆరాధ్య దైవంగా, మచ్చలేని నాయకుడిగా, ఆర్య వైశ్యులకు ఎన్నో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.