మరోసారి తెరపైకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు..

నాలుగేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ముగిసిపోయిందనుకున్న కేనును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మళ్లీ తిరగదోడింది. గత విచారణకు హాజరైన ప్రతి ఒక్కరినీ మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. విచారణ ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనుంది. ఈ జాబితాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు తొలి స్థానంలో ఉంది. ఎవరెవరు ఏ రోజు విచారణ ఎదుర్కోబోతున్నారో… వివరాలు ఇవిగో.

పూరి జగన్నాథ్ – ఆగస్ట్ 31

ఛార్మి – సెప్టెంబర్ 2

రకుల్ ప్రీత్ సింగ్ – సెప్టెంబర్ 6

రానా దగ్గుబాటి – సెప్టెంబర్ 8

రవితేజ – సెప్టెంబర్ 9

శ్రీనివాస్ – సెప్టెంబర్ 9

నవదీప్ – సెప్టెంబర్ 13

ఎఫ్ క్లబ్ జీఎం – సెప్టెంబర్ 13

ముమైత్ ఖాన్ – సెప్టెంబర్ 15

తనీశ్ – సెప్టెంబర్ 17

నందు – సెప్టెంబర్ 20

తరుణ్ – సెప్టెంబర్ 22