టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు: విచార‌ణ‌కు హాజ‌రైన హీరోయిన్ చార్మి

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో న‌గ‌దు లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన ఈడీ, దర్శకుడు పూరీ జగన్నాథ్‏ నుంచి ప‌లు వివ‌రాలు కూడా రాబ‌ట్టింది. ఈ రోజు విచార‌ణ‌లో భాగంగా హీరోయిన్ చార్మి ఈడీ కార్యాలయానికి చేరుకుంది. చార్మి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు ఆమె ప్రొడక్షన్ హౌస్ నుంచి జరిగిన లావాదేవీలనూ అధికారులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

కెల్విన్ ఇచ్చిన కీల‌క వివ‌రాల ఆధారంగా ఈ కేసులో ఈడీ విచార‌ణ కొనసాగిస్తోంది. 2017లోనూ చార్మి ఎక్సైజ్ శాఖ విచార‌ణ‌ను ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో విచార‌ణ అనంత‌రం మీడియాతో మాట్లాడ‌కుండానే ఆమె ఇంటికి వెళ్లిపోయింది.