Tollywood Drugs case: ఈడీ ఎదుట నందు.. ముందే విచారణ ఎందుకు?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్స్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు. తాజాగా మంగళవారం సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

మనీలాండరింగ్ కేసులో నందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ, షూటింగ్ వల్ల ముందుగా విచారించాలని నందు అధికారులను కోరడంతో ఈ రోజులు విచారణకు హాజరైనట్లు సమాచారం. నందు బ్యాంక్ ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ ఆరా తీసే అవకాశం ఉంది. డ్రగ్స్ వినియోగం, ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై నందుని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

హీరోయిన్‌ రకుల్ సైతం నోటీసులో పేర్కొన్న దాని కంటే ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు నందు సైతం 13రోజుల ముందుగానే విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్‌గా మారి ఇచ్చిన సమాచారంతో ఈ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో చార్మీ, రకుల్‌తో పరిచయాలు, ఎఫ్‌ క్లబ్‌తో ఉన్న సంబంధాలపై నందుపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఈ క్రమంలో చార్మీ, రకుల్‌తో పరిచయాలు, ఎఫ్‌ క్లబ్‌తో ఉన్న సంబంధాలపై నందుపై ప్రశ్నల వర్షం కురిపించనుంది.

మరోవైపు ఈ కేసులో బుధవారం(సెప్టెంబర్ 8) హీరో రానా దగ్గుబాటి విచారణకు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 9న హీరో రవితేజ హాజరవుతున్నారు. కాగా, రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈడీ అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. రకుల్ విచారణలో అయితే ఆమె బ్యాంకు అకౌంట్స్‌పై ఎక్కువగా ప్రశ్నించినట్లు సమాచారం.