టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ బయట పెడతా.. శ్రీరెడ్డి

గత కొంత కాలంగా డ్రగ్స్  వ్యవహారం భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమలను  కుదిపేస్తుంది. బాలీవుడ్ లో సుశాంత్ మరణం ఆత్మహత్య కేసుగా మొదలై ఆ తర్వాత డ్రగ్స్ కేసుగా మారింది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ ఇలా అన్ని పరిశ్రమలలోను డ్రగ్స్ కేసు నడుస్తుంది. కొంతంది ఆర్టిస్టులు డ్రగ్స్ మామూలు విషయమే అంటున్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది డ్రగ్స్ వాడతారు అంటూ ఇప్పటికే నటి మాధవీలత డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఎప్పుడూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఈ డ్రగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లోని డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. టాలీవుడ్ లో కొందరు మూవీ మాఫియాగా మారి చిన్న హీరోలను తొక్కేస్తున్నారని, వేషాలు ఎరవేసి అమ్మాయిలతో ఆడుకుంటున్నారని గతంలో చెప్పానని, అప్పట్లోనే డ్రగ్స్ గురించి కూడా నేను చెప్పానని తెలిపింది. చాలా మంది సెలెబ్రెటీలు రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం నాకు తెలుసు అని శ్రీరెడ్డి చెప్పింది. నాకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లో డ్రగ్స్ వాడే వారి పేర్లు చెబుతానని, పెద్ద పెద్ద హోటళ్లలో పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఆ పార్టీలకు వచ్చే అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారిని వాడుకుంటారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. అంతేకాక బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం బాగుందని శ్రీరెడ్డి తెలిపారు. దేశ సినీ పరిశ్రమ ప్రతిష్టకు మచ్చ రాకుండా కేంద్రం చేపట్టిన దర్యాప్తుపై శ్రీరెడ్డి అభినందించింది. అలాగే టాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శ్రీరెడ్డి ఆ వీడియో ద్వారా తెలియజేసింది.