టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి: జయరాం రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి డిమాండ్ చేసారు.

ఈ సందర్భంగా జయరాం రెడ్డి మాట్లాడుతూ. 2017 పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లిలో టమోటా రైతులకు 3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి రాయలసీమ ప్రాంతంలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం, ఆహార శుద్ధి విభాగం కింద జ్యూస్ తయారుచేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తాం అని హామీలు ఇచ్చి పూర్తిగా మర్చిపోయారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టమోటా రైతుకు కిలో టమోటా ధర రూపాయి కూడా లభించడం లేదు. కోత కోయడానికి కూలీల ఖర్చులు మార్కెట్కు కు తేవడానికి రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావట్లేదు. టమోటా రైతులంతా ఆరుకాలం కష్టించి శ్రమించి పండించిన పంటను రోడ్లపైన పారవేసి నిస్సహాయ స్థితిలో ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు.

టమోటా రైతులకు మార్కెటింగ్ శాఖ వారు సహకరించట్లేదు, దళారులు, వ్యాపారులు నిట్టనిలువునా ముంచేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు గొప్పలు చెప్పుకుంటూ, కాకి లెక్కలు చెబుతూ వ్యవసాయ రంగానికి లక్ష 28,000 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారు, బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాం అని చెప్పారు, ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు ఏర్పాటు చేశామని చెపుతున్నారు , సీ.ఎం యాప్ ద్వారా సమాచారం సేకరించి రైతులకు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకుంటున్నాం అని చెబుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి గారినీ సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు కేటాయించిన ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? ఈ మధ్యన కేంద్రం మినిస్టర్ కి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేసాం, సీఎం యాప్ ద్వారా సమాచారం సేకరించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని గొప్పలు చెప్పారు క్షేత్రస్థాయిలో ఇవన్నీ జరుగుతున్నాయా అని నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం?

తక్షణమే టమోటా రైతులకు గిట్టుబాటు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని జయరాం రెడ్డి డిమాండ్ చేసారు.